విశాఖ నగరంలోని చేపల దుకాణలను పోలీసులు మూసివేయించారు. కరోనా వ్యాప్తి నివారణ కోసం.. మాంసం, చేపలు, రొయ్యల అమ్మకాలపై నగర పాలక సంస్థ ఇవాళ నిషేధం విధించింది. కానీ కొందరు ఈ ఆదేశాలను పట్టించుకోకుండా యథేచ్ఛగా అమ్మకాలు కొనసాగించారు. కొన్నిచోట్ల మార్కెట్లోకే చేపలు తెచ్చి విక్రయించారు. బహిరంగంగా చేపలు అమ్మే దుకాణాలను పోలీసులు గుర్తించి మూసివేశారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకపొతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని.. గాజువాక, పెద్ద గంట్యాడ, గోపాలపట్నంకు చెందిన పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: