ETV Bharat / city

'విశాఖ కాన్వెంట్ జంక్షన్ను తుమ్మెదల మెట్టగా మార్చండి' - Simhachalam latest news

విశాఖ కాన్వెంట్ జంక్షన్​ని తుమ్మెదల మెట్టగా పేరు మార్చాలని నగర మేయర్​కి ఆలయ స్థానాచార్యులు విజ్ఞప్తి చేశారు. దీని చరిత్రను మేయర్​కు వివరించారు.

సింహాచలం
సింహాచలం
author img

By

Published : May 10, 2021, 10:24 AM IST

సింహాచల మహత్యాన్ని.. మేయర్ గొలగాని వెంటక హరి కుమారికి స్థానాచార్యులు డాక్టర్ టీపీ రాజగోపాల్ వివరించారు. 18వ శతాబ్దం తొలి భాగంలో తురుష్కులు హిందూ దేవాలయాలపై దాడి చేసిన సందర్భంలో సింహాచలం ఆలయంపైనా దాడికి వచ్చారని, నిధుల కోసం దేవాలయంలోకి ప్రవేశించి శిల్పకళలను ధ్వంసం చేశారని వివరించారు.. ఆ ఆనవాళ్లును మేయర్​కి ... స్థానా చార్యులు చూపించారు. చివరికి స్వామివారు తనను తాను కాపాడుకోవడానికి భారీ తుమ్మెదల రూపంలో బయలు దేరి తురుష్కుల మూకను తుమ్మెదల మెట్ట (ప్రస్తుతం కాన్వెంటు కూడలి)వరకు తరిమి కొట్టారని ఆలయచరిత్ర చెబుతోందని వివరించారు..

నిన్న మొన్నటివరకు ప్రస్తుత కాన్వెంట్ కూడలిని తుమ్మెదల మెట్టని పిలిచేవారు. అయితే కాల క్రమేణా ఆ పేరు పోయి... కాన్వెంట్ జంక్షన్ అని పిలుస్తున్నారు. అందుకే కాన్వెంట్ జంక్షన్ ను... తుమ్మెదల మెట్టగా నామకరణం చేసి... అక్కడ స్వామివారి జ్ఞాపకార్థం బోర్డు పెట్టాలని ... ఆ ప్రాంత విశిష్టత, స్వామివారి మహత్యం ఇప్పటి యువతకు చెప్పాలని స్థానాచార్యులు కోరగా... ఈ దిశగా తీర్మానం చేసేందుకు ప్రయత్నిస్తామని మేయర్ హామీనిచ్చారు.

ఇదీ చదవండి: గూడ్స్ దాటని ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్ వేగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.