ETV Bharat / city

సుధాకర్ కేసులో నేటి నుంచి సీబీఐ దర్యాప్తు - వైద్యుడు సుధాకర్ కేసు వివరాలు

వైద్యుడు సుధాకర్ కేసును విశాఖ సీబీఐ దర్యాప్తు చేయటంతో పాటు..నేటి నుంచే విచారణ ప్రారంభించనుంది.

Visakha CBI is investigating the case of doctor Sudhakar
విశాఖ సీబీఐకి వైద్యుడు సుధాకర్ కేసు
author img

By

Published : May 29, 2020, 10:34 AM IST

వైద్యుడు సుధాకర్ కేసును విశాఖ సీబీఐ దర్యాప్తు చేయనుంది. దర్యాప్తులో భాగంగా ...ఇవాళ్టి నుంచే విచారణ, వాంగ్మూలాల సేకరణ మెుదలుపెట్టనుంది. విశాఖ సిటీ పోలీసులతో పాటు... మానసిక ఆస్పత్రి వైద్యులను సైతం కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు విచారించనున్నారు. వైద్యుడు సుధాకర్‌ను కలసి విచారణ చేసి... వాంగ్మూలం సేకరించనున్నారు.

అసలు ఏం జరిగింది

కరోనా సమయంలో రక్షణ పరికరాలు కావాలని డాక్టర్​ సుధాకర్​ ప్రభుత్వాన్ని అడిగారు. ఎన్-95 మాస్కులు ఎందుకు ఇవ్వట్లేదంటూ ప్రశ్నించారు. అక్కడే మెుదలైంది వివాదం. విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో మత్తు వైద్యుడిగా పనిచేస్తున్న సుధాకర్.... కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులకు ఎన్-95 మాస్కులు ఇవ్వడం లేదంటూ.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 8న డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేస్తూ... ఆదేశాలు వెలువడ్డాయి. అప్పటి నుంచి డాక్టర్ సుధాకర్‌కు కష్టాలు మెుదలయ్యాయి.

సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా... మే 16న విశాఖలో పోర్టు ఆసుపత్రి ఎదుట అర్ధనగ్నంగా... డాక్టర్ సుధాకర్ నిరసన వ్యక్తం చేశారు. గొడవ చేస్తున్నట్లు స్థానికులు చెప్పగా... అక్కడికి వెళ్లిన పోలీసులు... ఆయన ఎవరో తెలుసుకోకుండానే చేతులు వెనక్కి విరిచికట్టి రోడ్డుపై పడుకోబెట్టారు. ఆ తర్వాత ఆటోలో కుదేసి పోలీస్ స్టేషన్‌కు..., అక్కడి నుంచి కేజీహెచ్​కు తీసుకెళ్లారు. సుధాకర్‌ మానసిక పరిస్థితి బాగోలేదని కేజీహెచ్‌ వైద్యులు చెప్పడంతో.... పోలీసులు ఆయనను ప్రభుత్వ మానసిక వైద్యశాలకు తరలించారు. సుధాకర్‌పై 353, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

డాక్టర్‌ సుధాకర్‌ అంశం రాష్ట్రంలో రాజకీయంగానూ సంచలనం కలిగించింది. ఆసుపత్రిలో సరైన సదుపాయాలు కావాలని అడిగిన వైద్యుడిని అరెస్టు చేయడమేంటని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి.

మే 18న డాక్టర్ సుధాకర్ అరెస్టుపై.. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వైద్యుడి హక్కులకు భంగం కలిగించేలా అర్ధ నగ్నంగా ఉంచి అరెస్ట్ చేశారంటూ.. హైకోర్టు దృష్టికి విషయం వెళ్లింది. కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు... సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. 8 వారాల్లోపు నివేదికను ఇవ్వాలని సూచించింది.

ఇవీ చదవండి: 'హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.