ఆసుపత్రిలో కరోనా మహిళను పట్టించుకోలేదన్న ఘటనపై ఆరా తీసినట్లు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కడాలి సత్య వరప్రసాద్ తెలిపారు. కరోనాతో బాధపడుతున్న మహిళ బాత్రూంకు వెళ్తుండగా పడిపోయారన్నారు. సిబ్బంది త్వరితగతిన స్పందించి ఆమెను బెడ్‌పైకి చేర్చారని చెప్పారు. ఈలోపు మరొకరు చరవాణిలో వీడియో తీసి మీడియాకు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతుందన్నారు. వృద్ధురాలి ఆరోగ్య పరిస్థతి స్థిరంగా ఉందని తెలియజేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు అధికారులు, వైద్య సిబ్బంది శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారని.. వైద్యులు తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారని వివరించారు. బాధితులు కోలుకునేంత వరకూ ప్రభుత్వమే అన్నిరకాల సేవలు అందిస్తోందని విమ్స్ డైరెక్టర్ చెప్పారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే 104ను గాని, జిల్లా కంట్రోల్ రూం నంబరును కానీ సంప్రదించవచ్చన్నారు.
ఇదీ చదవండి :