ఇవీ చదవండి...రంగంలోకి రాజకీయ వారసులు
'నిర్మాణాలకు' జీఎస్టీ తగ్గించాలి! - gst
నిర్మాణ రంగానికి భారంగా మారిన జీఎస్టీ తగ్గింపునకు రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని క్రెడాయ్ విశాఖ శాఖ నిర్ణయించింది. జిఎస్టీ తగ్గించాలన్న డిమాండ్‌పై జిఎస్టీ కౌన్సిల్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరింది.
క్రెడాయ్ ప్రతినిధుల సమావేశం
నిర్మాణ రంగానికి భారంగా మారిన వస్తుసేవల పన్ను రేటుతగ్గింపునకు... రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని క్రెడాయ్ విశాఖ శాఖ నిర్ణయించింది. ఈ డిమాండ్‌పై జీఎస్టీ కౌన్సిల్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పుల్వామా దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఆయా జిల్లాల్లో రెండు పడక గదుల ఫ్లాట్లు కట్టించి ఇవ్వాలన్న... జాతీయ క్రెడాయ్ నిర్ణయానికి అనుగుణంగా తామూ సహాయం అందిస్తున్నట్టు వివరించింది. సిమెంట్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడం వల్ల నిర్ణాణ రంగానికితీవ్ర విఘాతం కలుగుతోందని.. ఈ పరిణామాన్నివెంటనే సరిదిద్దుకోవాలని కోరింది. ఈ వ్యవహారంపై సర్వోన్నత న్యాయ స్ధానంలో కేసు నడుస్తోందని క్రెడాయ్ ప్రతినిధులు తెలిపారు.
ఇవీ చదవండి...రంగంలోకి రాజకీయ వారసులు
sample description