ఏళ్ల తరబడి జీతాలు లేకపోయినా విధులు నిర్వహించిన వెలుగు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, జిల్లాలో కలెక్టర్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. వివోఏఆర్పీ లకు ప్రభుత్వం పదివేల రూపాయల వేతనం ప్రకటన చేసినప్పటి నుంచి వెలుగు ఉద్యోగులకు స్థానిక రాజకీయ నాయకల నుంచి ఒత్తిడి పెరిగిపోయిందని వాపోయారు. అకారణంగా తమను విధుల్లోనుంచి తొలగించి నాయకులకు సంబంధించిన వారిని విధుల్లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, వెలుగు ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. బకాయిపడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని,పెంచిన పదివేల గౌరవ వేతనం జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించని పక్షంలో చలో అసెంబ్లీ కార్యాక్రమం చేపటతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తల ధర్నా