విశాఖ శిరోముండన బాధితుడికి తగు రక్షణ కల్పించాలని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య విశాఖ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. గతించిన ఫ్యూడల్ వ్యవస్థ రాష్ట్రంలో మళ్లీ రూపు దాల్చిందని మండిపడ్డారు. అధికార పార్టీ నేత నూతన నాయుడు ఇంట్లో మహిళలు బలహీనవర్గానికి చెందిన యువకుడి శిరోముండనం చేయడం అందుకు నిదర్శనమన్నారు. బాధితుడు తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భయపడుతున్నాడన్న ఆయన.. ప్రాణహాని ఉందని కంగారు పడుతున్నాడని లేఖలో పేర్కొన్నారు. బాధితుడికి ఏమి జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు.
ఇదీ చదవండి: ప్రశాంత్ భూషణ్‌కు శిక్ష ఖరారు- ఒక్క రూపాయి జరిమానా