విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద గిరిజన సంఘ యువకులు నిరసనకు దిగారు. నిధులు మంజూరు చేసినా తమ గిరిజన గ్రామాలకు రోడ్లు వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖ జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయితీ పరిధిలో పది గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. అయినా సరే వెనకడుగు వేయకుండా శ్రమదానం చేసి రోడ్లు వేసుకున్నారు. ఎన్నో సందర్భాలలో కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధికి మెుర పెట్టుకున్నా తమ గోడు వినలేదు. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి 17కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. కానీ రోడ్డు మాత్రం వేయలేదు. ఫలితంగా అనారోగ్యమైనా, గర్భిణీ స్త్రీలకైనా డోలీనే దిక్కయింది. అందుకే ప్రభుత్వానికి తమ గోడు తెలియాలని అనుకున్న గిరిజన యువకులు విశాఖ నగరంలో జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద నిరసనకు దిగారు. ఒంటికి ఆకులు కట్టుకుని, డోలీ మోసుకుంటూ విశాఖ రోడ్లపై నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఇప్పటికైనా స్పందించి రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
భార్య నగ్న వీడియోలతో వ్యాపారం.. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు