విశాఖప జిల్లా పాయకరావుపేట పోలీసు స్టేషన్కు చెందిన ఓ పెట్రోలింగ్ వాహనం అపహరణకు గురైంది. నక్కపల్లి నుంచి పాయకరావుపేట వరకు 16వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ నియంత్రణకు ఈ వాహనాన్ని పోలీసులు ఉపయోగిస్తున్నారు. అపహరణకు గురైన వాహనాన్ని గొడిచెర్ల వద్ద పోలీసులు గుర్తించారు. జీప్ ముందు భాగం ప్రమాదానికి గురికావటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మతిస్థిమితం లేని వ్యక్తి వాహనాన్ని తీసుకెళ్లినట్లు పోలీసులు చెప్తున్నారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: కడపలో సినీఫక్కీలో చోరీ- అన్నీ అనుమానాలే