ETV Bharat / city

ఎల్జీ పరిశ్రమ గేటు ముందు మృతదేహాలతో స్థానికులు ఆందోళన - విశాఖ కెమికల్ గ్యాస్ లీకేజీ

విశాఖలో పెను విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ గ్యాస్‌ లీకేజీ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలతో పరిశ్రమ గేటు వద్ద ఆందోళన చేపట్టారు.

the-visakha-lg-industry-is-a-concern-of-locals-with-slaughtered-bodies
ఎల్జీ పరిశ్రమ గేటు ముందు మృతదేహాలతో స్థానికులు ఆందోళన
author img

By

Published : May 9, 2020, 12:11 PM IST

Updated : May 9, 2020, 1:04 PM IST

విశాఖ ఎల్​జీ పరిశ్రమ గేటు వద్ధ మృతదేహాలతో ఆందోళన

విశాఖ ఎల్​జీ పరిశ్రమ వద్ద మరోసారి స్థానికులు ఆందోళన చేపట్టారు. పరిశ్రమ గేటును తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పరిశ్రమ గేటు వద్ద మృతదేహాలతో స్థానికులు ఆందోళన చేస్తున్నారు. పరిశ్రమ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. స్థానికులు గేటు వద్ద ధర్నాకు దిగడంతో డీజీపీ లోపలే ఉండిపోయారు. దాంతో డీజీపీ చుట్టూ రక్షణ వలయంగా పోలీసులు ఏర్పడ్డారు. గ్రామస్థులను నియంత్రించి డీజీపీని పోలీసుల పంపేశారు. పరిశ్రమలోకి రాకుండా స్థానికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. సంయమనం పాటించాలని స్థానికులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. పరిశ్రమ పరిసరాల్లో పరిస్థితిని సీపీ మీనా పర్యవేక్షిస్తున్నారు.

తమ ఆగ్రహం చల్లార్చేందుకు కమిటీ: స్థానికులు

నేతలు, అధికారులు పరిశ్రమను చూసి వెళ్లిపోతున్నారు తప్ప..ఎవరూ బాధిత గ్రామాల్లోకి రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత 5 గ్రామాల ప్రజల బాగోగులు చూడటం లేదన్న వారు...కనీసం తమకు ఆహారం, తాగునీరు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. ప్రజాప్రతినిధులు వచ్చి 5 గ్రామాల కష్టాలు వినాలని కోరారు. పరిశ్రమను మూసివేస్తామని యాజమాన్యం ప్రకటించాలని స్థానికులు డిమాండ్ చేశారు. పరిశ్రమ యజమానులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. తమ ఆగ్రహం చల్లారేందుకు మాత్రమే ఈ కమిటీ వేశారని వారు పేర్కొన్నారు. ఆ కమిటీలో ఉన్న అధికారులు సాంకేతిక నిపుణులు కాదన్నారు. కంపెనీ మూసివేత ప్రకటన వస్తేనే స్థానికులు శాంతిస్తారన్నారు. 5 బాధిత గ్రామాల్లో వైద్యశిబిరాలు కూడా ఏర్పాటు చేయలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి...విశాఖ ఎల్జీ పాలిమర్స్ వద్ద గ్రామస్థుల ఆందోళన

Last Updated : May 9, 2020, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.