విశాఖలో ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమిస్తున్న నిరసనకారులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. డైరెక్టర్ ఫైనాన్స్ వేణుగోపాల్ వాహనాన్ని నిరసనకారులు చుట్టుముట్టారు. వేణుగోపాల్‌రావును ముట్టడి నుంచి విడిపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. నిరసనకారులతో కార్మిక సంఘాల నేతలు చర్చించారు. వేణుగోపాల్‌రావును విడిచిపెట్టేందుకు ఒప్పుకోబోమని నిరసనకారులు అన్నారు.
సీఎం అఖిలపక్షంతో కలిసి ప్రధానిని కలుస్తానన్నారని కార్మికసంఘాలు వివరించాయి. ప్రధానిని కలిసినా ఆయన వింటారని అనుకోలేమని కార్మికసంఘాలు వ్యాఖ్యానించాయి. వచ్చేనెల 20 తర్వాత దేశవ్యాప్త సమ్మెకు సన్నద్ధమవుతున్నామని కార్మికసంఘాలు స్పష్టం చేశాయి. దేశానికి దిక్సూచిగా ఉక్కు ఉద్యమాన్ని నడిపిద్దామని పిలుపునిచ్చాయి. విశాఖ ఉక్కు డైరెక్టర్ ఫైనాన్స్ వేణుగోపాల్‌ను ఆందోళనకారులు విడిచిపెట్టారు. కార్మికసంఘాల చర్చలతో వేణుగోపాల్‌ను ఆందోళనకారులు విడిచిపెట్టారు.
ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కొనసాగింది. కూర్మన్నపాలెం కూడలిలో రాత్రి నుంచి నిరసన చేశారు. కూర్మన్నపాలెం కూడలిలో బైఠాయించి మహిళలు నిరసన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మానవహారంగా ఏర్పడి కార్మికులు రహదారిని దిగ్బంధించారు. గాజువాక, అగనంపూడి పరిసరాల్లో వాహనాల రాకపోకలు నిలిచాయి.
ఇదీ చదవండీ... స్టీల్ ప్లాంట్‌పై మరోసారి ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ