తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విశాఖలోని శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొన్నారు. శారదాపీఠ ప్రతినిధులు తమిళిసైకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాజశ్యామల దేవికి తెలంగాణ గవర్నర్ పూజలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ సహా.. సభాపతి తమ్మినేని సీతారం, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్, ఇతర రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు కూడా ఈ వార్షికోత్సవాలకు హాజరయ్యారు.
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న తమిళిసై
సింహాచలం సింహాద్రి అప్పన్నను తెలంగాణ గవర్నర్ తమిళిసై దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అధికారులు ఆమెకు స్వామి ప్రసాదాలు అందజేశారు.
ఇవీ చదవండి: