ETV Bharat / city

పల్లాతో దీక్ష విరమింపజేసిన చంద్రబాబు - palla srinivas agitation on vishaka steel plant

తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు నిరాహార దీక్షను ఆ పార్టీ అధినేత చంద్రబాబు విరమింపజేశారు. విశాఖ కిమ్స్ ఐకాన్​ ఆస్పత్రిలో ఓఆర్‌ఎస్ ఇచ్చి దీక్ష విరమింపజేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పల్లా శ్రీనివాసరావు నిరశన దీక్ష చేపట్టారు.

babu
babu
author img

By

Published : Feb 16, 2021, 2:58 PM IST

Updated : Feb 17, 2021, 6:50 AM IST

పల్లా శ్రీనివాసరావును పరామర్శించిన చంద్రబాబు

విశాఖ షీలానగర్‌లోని కిమ్స్‌ ఐకాన్ ఆస్పత్రిలో తెదేపా నేత పల్లా శ్రీనివాసరావును.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఓఆర్‌ఎస్ ఇచ్చి పల్లా శ్రీనివాస్‌ నిరాహార దీక్ష విరమింపజేశారు. ఉక్కు పరిశ్రమ కోసం పల్లా 6 రోజులు దీక్ష చేశారని చంద్రబాబు అన్నారు.

సోమవారం అర్ధరాత్రి పల్లా ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఈ నెల 10న పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. చంద్రబాబు పర్యటనకు ముందే పల్లా దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

ఇదీ చదవండి: ఆమరణ దీక్ష కొనసాగిస్తా : తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు

Last Updated : Feb 17, 2021, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.