ఈ నెల 27 నుంచి గుంటూరు - రాయగఢ్‌కు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. 07243 నెంబర్ గల ట్రైన్ ప్రతిరోజూ గుంటూరులో రాత్రి 11.20 గంటలకు బయలుదేరి.. మరసటి రోజు ఉదయం 8.45 గంటలకు విశాఖ చేరుతుంది. అక్కడి నుంచి 9.05 గంటలకు బయలుదేరి.. మధ్యాహ్నం 1.40 గంటలకు రాయగఢ్ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఈ రైలు 07244 నెంబర్‌తో మధ్యాహ్నం 2.50 గంటలకు రాయగడలో బయలుదేరి.. సాయంత్రం 7.15 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. అక్కడి నుంచి 7.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.15 గంటలకు గుంటూరు చేరుకుంటుంది.
మంగళగిరి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, భీమడోలు, తాడేపల్లిగూడెం, నిదడవోలు, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, తుని, నర్సీపట్నం రోడ్, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విశాఖ, సింహాచలం, విజయవనగరం, గజపతి నగరం, కొమటిపల్లి, డొంకినవలస, బొబ్బిలి, సీతానగరం, పార్వతీపురం, పార్వతీపురంటౌన్లలో ఈ రైలుకు స్టాపులు ఉన్నాయి.
ఇదీ చదవండి: