విశాఖ జిల్లాలో పిల్లల విక్రయాల కేసులకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినట్లు సీపీ ఆర్కే మీనా తెలిపారు. ఏసీపీ మూర్తి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. సృష్టి ఆసుపత్రితో వివిధ ఆసుపత్రులకు లింకులు ఉన్నట్లు గుర్తించారు. విశాఖలోని ఐవీఎఫ్, పిల్లల ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విశాఖలోని పద్మశ్రీ ఆసుపత్రి వైద్యురాలు పద్మజను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఆసుపత్రిలో రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో లక్షా 50 వేలు దాటిన కరోనా కేసులు