విశాఖలోని సింహాచలం దేవస్థానానికి 16 మంది సభ్యులతో కూడిన పాలకమండలి ఏర్పాటైంది. దేవస్థానం ఛైర్‌పర్సన్‌గా మాజీ ఎంపీ, దివంగత ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో తన తండ్రి ఆనంద్ గజపతిరాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో తాను సేవా సంస్థ ద్వారా ప్రజలకు మంచినీరు, బయో టాయిలెట్స్, పాఠశాలల అభివృద్ధిపై పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. తనను గుర్తించి ఛైర్పర్సన్ పదవి కేటాయించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు ఇంత పెద్ద స్థాయిలో పదవులను కల్పించిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందని మంత్రి అవంతి అన్నారు.
సింహాచలం దేవస్థానం నూతన చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతిరాజు - Simhachalam Temple new chairperson news
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలకమండలి కొలువైంది. సింహాచల దేవస్థాన ట్రస్టుబోర్డు ఛైర్‌పర్సన్‌గా మాజీ ఎంపీ, దివంగత ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజు ప్రమాణస్వీకారం చేశారు.
విశాఖలోని సింహాచలం దేవస్థానానికి 16 మంది సభ్యులతో కూడిన పాలకమండలి ఏర్పాటైంది. దేవస్థానం ఛైర్‌పర్సన్‌గా మాజీ ఎంపీ, దివంగత ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో తన తండ్రి ఆనంద్ గజపతిరాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో తాను సేవా సంస్థ ద్వారా ప్రజలకు మంచినీరు, బయో టాయిలెట్స్, పాఠశాలల అభివృద్ధిపై పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. తనను గుర్తించి ఛైర్పర్సన్ పదవి కేటాయించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు ఇంత పెద్ద స్థాయిలో పదవులను కల్పించిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందని మంత్రి అవంతి అన్నారు.
ఇదీ చూడండి: సింహాచలంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ పర్యటన