ETV Bharat / city

హానికారక పరిశ్రమలు ఊరికి దూరంగా : సీఎం జగన్

విశాఖలో విషవాయువులు ఉన్న పరిశ్రమలు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. భవిష్యత్తులో గ్యాస్​ లీకేజీ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఘటన జరిగిన పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న రసాయనాలను తరలించే అవకాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హానికారక పరిశ్రమలు ఊరికి దూరంగా తరలింపుపై ఆలోచించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

cm jagan
cm jagan
author img

By

Published : May 8, 2020, 4:33 PM IST

Updated : May 9, 2020, 6:51 AM IST

జనావాసాల మధ్య ఉన్న హానికారక పరిశ్రమలను దూరంగా తరలించే విషయంలో విధానపరమైన ఆలోచన చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. విశాఖలో ఇలాంటి పరిశ్రమలు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని చెప్పారు. విశాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి వివేక్‌ యాదవ్‌ వస్తున్నారని, ఈ ఘటనపై సమగ్ర విచారణతో పాటు.. కార్యాచరణ ప్రణాళికతో రావాలని సీఎం ఆదేశించారు.

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం ఆయన విశాఖ విషవాయు ఘటనపై వీడియోకాన్ఫరెన్సులో సమీక్షించారు. విశాఖలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, కలెక్టర్‌ వినయ్‌చంద్‌, పోలీసు కమిషనర్‌ ఆర్‌కె మీనా తదితరులు పాల్గొన్నారు. కాలుష్య కారక అంశాలు, వాటి నివారణ, ప్రామాణిక నిర్వహణ విధానాల వివరాలను సిద్ధం చేయాలని వారికి సీఎం చెప్పారు. విశాఖలో పరిస్థితి అదుపులో ఉందని సీఎస్‌ నీలం సాహ్ని వివరించారు. ట్యాంకరులోని రసాయనంలో 60% పాలిమరైజ్‌ అయిందని, మిగిలింది కావడానికి 18-24 గంటల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారన్నారు.

ఫ్యాక్టరీలో ఉన్న రసాయనాల తరలింపు, ముడి పదార్థాల వినియోగంపై ఇంజినీర్లతో మాట్లాడాలని ముఖ్యమంత్రి సూచించారు. బాధిత కుటుంబాలకు తక్షణమే రూ. కోటి పరిహారం విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. కంపెనీలో మిగతా ట్యాంకులన్నీ భద్రంగానే ఉన్నట్లు కలెక్టర్‌ వినయ్‌చంద్‌ చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటించడాన్ని అధికారులు ప్రశంసించారు. గతంలో తూర్పుగోదావరి జిల్లా నగరం గ్యాస్‌ లీకేజి ఘటన సమయంలో.. విదేశాల్లో చేసినట్లే ఇక్కడా సాయం చేయాలని తాను డిమాండ్‌ చేసిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు.

ఇదీ చదవండి

50 కోట్లు జమచేయండి.. ఎల్జీకి ఎన్జీటీ నోటీసులు

Last Updated : May 9, 2020, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.