విద్యుత్ చార్జీల టారిఫ్ పై మూడు రోజుల పాటు సాగే బహిరంగ ప్రజాభిప్రాయసేకరణ విశాఖలో ప్రారంభమైంది. ఈనెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రజలు తమ సమస్యలను ఈఆర్సీ దృష్టికి తీసుకురానున్నాయి.
ప్రజలు తమ పరిధిలోని ఆయా విద్యుత్ సర్కిల్, డివిజన్ కార్యాలయం ద్వారా వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొని.. తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఈ బహిరంగ విచారణ జరిగే తీరును ముందుగానే వివరించారు.
విద్యుత్ పంపిణీ సంస్థలు 2021-22 ఆర్థిక సంవత్సర వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై నివేదికలను ఏపీఈఆర్సీకి సమర్పించాయి. వీటిని బహిరంగ ప్రకటనల ద్వారా ప్రజలకు తెలియజేశాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఇంధనశాఖ, ఏపీట్రాన్స్కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు పాల్గొన్నారు.