'రోగ నిరోధక శక్తితో కరోనా నుంచి రక్షణ పొందవచ్చు' - రోగ నిరోధక శక్తిపై ప్రొఫెసర్ అప్పారావు ఇంటర్వ్యూ న్యూస్
నానాటికీ విస్తరిస్తున్న కొవిడ్ మహమ్మారి తన రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుందన్నది విశ్లేషకుల మాట. దీనిపై ఆంధ్ర వైద్య కళాశాల మైక్రోబయాలజీ ఆచార్యుడు అప్పారావు తన సహచరులతో కలిసి రూపొందించిన పత్రం అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమైంది. రోగ నిరోధకశక్తి మాత్రమే కరోనాను అడ్డుకోగలదని పరిశీలనా పత్రంలో వివరించారు. వ్యాక్సిన్ పట్ల ఎటువంటి అపోహలు అవసరం లేదని.. టీకా మాత్రమే కరోనా రక్కసి నుంచి బయటపడేందుకు తోడ్పడుతుందని చెబుతున్న ప్రొఫెసర్ డాక్టర్ అప్పారావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి..