విశాఖలోని కేజీహెచ్‌లో ఆదివారం రాత్రి దాదాపు గంటపాటు విద్యుత్ సరఫరా నిలిచింది. ఆసుపత్రిలోని రోగులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఆదివారం రాత్రి 7 నుంచి 8.15 గంటల వరకు విద్యుత్ నిలిచిపోయింది. వార్డుల్లో అలుముకున్న చీకటితో రోగులు ఇక్కట్లకు గురయ్యారు. దాదాపు రెండు గంటలపాటు సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. కేజీహెచ్‌కి విద్యుత్ సరఫరా చేసే హైటెన్షన్ విద్యుత్ తీగలపై దీపావళి మందుగుండు నిప్పులు పడటం వల్ల అంతరాయం కలిగిందని అధికారులు చెప్పారు. జనరేటర్ ఉన్న వార్డులు, అత్యవసర వార్డులకూ కొంత ఇబ్బంది తప్పలేదు.
ఇవీ చదవండి