వల్లభనేని వంశీ రాసిన రెండో లేఖపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. పార్టీ పట్ల వంశీకి ఉన్న అంకితభావం, పోరాటం మరిచిపోలేనివని అన్నారు. వైకాపా ప్రభుత్వంపై చేసే పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. తదుపరి కార్యాచరణకు కేశినేని నాని, కొనకళ్ల సమన్వయంగా ఉంటారని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి వారితో చర్చించి కార్యాచరణ రూపొందించుకోవాలని చంద్రబాబు సూచించారు.
ఇదీ చదవండి: