కరోనా వ్యాప్తి నివారణ దిశగా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖలోని ప్రభుత్వ అతిథి గృహంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కరోనాను ప్రజలు తేలిగ్గా తీసుకోవద్దని... అలాగే ఆందోళన చెందవద్దని సూచించారు. సామాజిక మాధ్యమాల్లోని వదంతులను నమ్మొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చే వారికి అన్ని పరీక్షలు నిర్వహించి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని నిర్ధరణ అయ్యాకే బయటకు పంపుతామని తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా నుంచి కోలుకొని గుండెపోటుతో వ్యక్తి మృతి