ETV Bharat / city

నేడు జాతీయ వినియోగదారుల దినోత్సవం - జాతీయ వినియోగదారుల దినోత్సవం

డబ్బులు చెల్లించాక.. ఏదైనా వస్తువు, సేవను పొందే హక్కు వినియోగదారునికి పూర్తిగా ఉంటుంది. వారిని మోసగించినా.. తప్పుదోవ పట్టించినా.. వినియోగదారులకు అండగా నిలుస్తుంది.. వివాదాల పరిష్కార కమిషన్‌. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా.. కమిషన్‌ ద్వారా ఫిర్యాదులు పరిష్కృతమయ్యే తీరుపై ప్రత్యేక కథనం.

national-consumers-day
national-consumers-day
author img

By

Published : Dec 24, 2020, 9:52 AM IST

మనం.. ఓ వస్తువు కొన్నా, సేవ పొందినా.. దానిపై పూర్తి హక్కులు ఉంటాయి. ఈ క్రమంలో.. వస్తువు పాడై ఉన్నా, సేవలు సరిగ్గా అందకపోయినా.. ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది.. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్. గతంలో ఉన్న వినియోగదారుల ఫోరం.. కేంద్రం చేసిన కొత్త చట్టంతో కమిషన్‌గా మారింది. సేవా లోపాలు, వస్తువుల గ్యారంటీపై రెండేళ్లలోగా కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. కొనుగోలు చేసినప్పటి బిల్లు తప్పనిసరిగా భద్రపర్చుకోవాలి. ఫిర్యాదు చేసేందుకు ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి.

  • వస్తువు లేదా సేవ విలువ 5 లక్షల లోపైతే ఎలాంటి ఫీజు లేదు...
  • 5 నుంచి 10 లక్షల మధ్య అయితే 200 రూపాయలు...
  • 10 నుంచి 20 లక్షల మధ్య అయితే 400...
  • 20 నుంచి 50 లక్షల మధ్య అయితే వెయ్యి...
  • అరకోటి నుంచి కోటి మధ్య 2వేలు....
  • కోటి నుంచి 2 కోట్ల మధ్య రెండున్నర వేలు....
  • 2 నుంచి 4 కోట్ల మధ్య మూడు వేలు....
  • 4 నుంచి 6 కోట్ల మధ్య 4 వేలు....
  • 6 నుంచి 8 కోట్ల మధ్య 5 వేలు...
  • 8 నుంచి 10 కోట్ల మధ్య 6వేలు...
  • 10 కోట్లపైన అయితే ఏడున్నర వేల రూపాయలు.. ఫీజు కింద చెల్లించాలి.

నిబంధనల ప్రకారం.. మనం ఎవరి మీదైతే ఫిర్యాదు చేశామో.. వారు నోటీసులందుకున్న 90 రోజుల్లోగా తీర్పునివ్వాలి. తీర్పు అమల్లో భాగంగా పరిహారం చెల్లించకపోతే నెల నుంచి 3 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఏదైనా వస్తువు కొనుగోలు చేసేముందే.. దాని నాణ్యత నిర్ధరణకు.. భారతీయ ప్రమాణాల బ్యూరో-బీఐఎస్​ ద్వారా నిర్ధరించుకనే వీలుంది. వినియోగదారుల హక్కులపై విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: మరో వేషంలో మహమ్మారి.. మరింత ప్రమాదకారి.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.