విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. వైఎస్ఆర్ బీమాను.. కుటుంబంలో పని చేసే ప్రతి ఒక్కరికీ వర్తింపజేయాలని గణబాబు కోరారు. చంద్రన్న బీమాను గతంలో ఆ విధంగా అమలు చేశామని గుర్తు చేశారు. ఇంటి పెద్దకు మాత్రమే బీమా అనే విధానం సరికాదని లేఖలో పేర్కొన్నారు.
డ్వాక్రా రుణమాఫీ ఒక్కో గ్రూపునకు ఒక్కోలా చేశారన్న గణబాబు... ఫలితంగా విశాఖలో 7వేల డ్వాక్రా గ్రూపులకు నష్టం జరిగిందని లేఖలో వివరించారు. ఒక రాష్ట్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఒక మతాన్ని కించపరిచేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మౌనంతో అదే ప్రభుత్వ వైఖరి అనుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే గణబాబు అన్నారు.
ఇదీ చదవండీ... శ్రీకాళహస్తిలో అనధికార విగ్రహాలు: నిందితుల అరెస్టు