విశాఖ జిల్లా భీమునిపట్నం మంగమారి పేటలో కోటి రూపాయల నిధులతో మత్స్యకారుల కోసం ఏర్పాటుచేసిన షెల్టర్లను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. మత్య్సకారులకు మౌలిక సదుపాయాల కల్పనకు, చేపలు, వలలు భద్రపరిచుకునేందుకు షెల్టర్లు నిర్మించామన్నారు. మత్స్యకారులు అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.
![మత్స్యకారుల మౌలిక సదుపాయాల భవనాన్ని ప్రారంభిస్తోన్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-vsp-106-16-inaguration-fisharies-building-mantri-avanthi-av-ap10079_16102020180032_1610f_1602851432_402.jpg)
ఈ షెల్టర్ల వల్ల గ్రామంలో సుమారు 5 వేల మంది జీవనాధారం మెరుగుపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. చేపలు వేలం వేసుకోడానికి, వలలు కుట్టుకోవడానికి, చేపలు ఎండబెట్టుకోవడానికి షెల్టర్ల ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ గోవిందరావు, మత్స్యశాఖ జేడీ కె.ఫణిప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తగరపువలసలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న కాల్వలకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఇదీ చదవండి : 'దసరాకైనా తెలంగాణలోకి బస్సులు అనుమతిస్తారని ఆశిస్తున్నాం'