జిల్లాలో వర్షాలు, ముంపు, సహాయ చర్యలపై మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపిందని మంత్రి కన్నబాబు అన్నారు.
ప్రాణనష్టం జరగకుండా, సహాయచర్యలు చేపట్టాలని అధికారులను అప్రమత్తం చేశామని కన్నబాబు అన్నారు. వర్షం ఆగిన వెంటనే పంటనష్టం అంచనా వేస్తామన్నారు. పారిశుద్ధ్యం విషయంలో జీవీఎంసీ అధికారులు అప్రమత్తం కావాలన్నారు.
ఇదీ చదవండి: