ETV Bharat / city

మెడికల్ సీటు వచ్చిందన్నారు... 9 లక్షలు కాజేశారు... - cyber crima

గుర్తు తెలియని మెయిల్, ఫోన్ నెంబర్ లకు స్పందించవద్దని విశాఖ సైబర్ క్రైం సీఐ గోపీనాథ్ సూచించారు. మెడికల్ సీటు వచ్చిందని నమ్మించి 9 లక్షల 45 వేలు స్వాహా చేసిన ఘటన విశాఖలో జరిగింది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాలకు వెళ్లి సంప్రదించాలని... కేటు గాళ్ల వలలో పడి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు

'మెడికల్ సీటు వచ్చిందని నమ్మించి 9 లక్షల 45 వేలు స్వాహా'
author img

By

Published : Sep 5, 2019, 9:25 AM IST

మెడికల్ సీటు వచ్చిందని నమ్మించి 9 లక్షల 45 వేల రూపాయల మోసానికి పాల్పడ్డ ఘటన విశాఖలో చోటుచేసుకుంది. పెదగంట్యాడ కు చెందిన రవీంద్రనాథ్ రెడ్డి కుమార్తె 2019 నీట్ అర్హత సాధించడంతో సీటు కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో నీట్ నిబంధనల ప్రకారం రాయితీ లేని ఎంబీబీఎస్ సీటుకు కోల్ కత్తా, మహారాష్ట్ర ప్రభుత్వ కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చు, ఇతర వివరాలకు ఫోన్ చేయాలని రవీంద్రనాథ్ రెడ్డి సెల్ కు సంక్షిప్త సమాచారం వచ్చింది.వెంటనే స్పందించి ఆ నెంబర్​కు ఫోన్ చేశారు.

కోల్ కతా జాతీయ వైద్య కళాశాలలో ఈఎస్ఐసి కోటా కింద మీ అమ్మాయికి మెడికల్ సీటు ఖరారైందని.... 45వేలు డాక్టర్ అనురాగ్ జాయింట్ డైరెక్టర్,డీజీఎల్ డబ్ల్యూ బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాలో వేయాలని అపరిచిత వ్యక్తి సూచించాడు. ఇది నిజమే అనుకొని నగదు వేయగా... అనంతరం రవీంద్రనాథ్ రెడ్డి మెయిల్ కు అలాట్ మెంట్ ప్రాసెస్ కాపీ (నియామక పత్రం) పంపించి, మరోసారి కాషన్ డిపాజిట్ కింద తొమ్మిది లక్షలు... రెండు దఫాలుగా చెల్లించాలని చెప్పాడు. దీంతో మొదటి విడతగా నాలుగు లక్షల యాభై వేలు డిపాజిట్ చేశారు.

నిందితుడు ఒక మెయిల్ ఐడి, పాస్వర్డ్ పంపించి అందులో వివరాలు పరిశీలించుకోమని రవీంద్రనాథ్ రెడ్డికి సూచించాడు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతుల ఉత్తర్వులు, అంగీకార పత్రం ఉండడంతో మిగిలిన నాలుగు లక్షల యాభై వేల రూపాయలు జమ చేశారు. గత నెల 31వ తేదీన వెబ్సైట్, ఫోన్ నెంబర్లు పనిచేయకపోవడంతో అనుమానం వచ్చి కోల్ కతా వైద్య విద్యాలయం ను సంప్రదించగా అది అబద్దమని తేలింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆయన సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోపీనాథ్ తెలిపారు.

Intro:FILE NAME : AP_ONG_05_04_MEDAL_TESTS_BUND_PKG_03_3061002_SD

నోట్ : ఒంగోలు నుండి వచ్చే ఫైల్ లో స్క్రిప్ట్ ను వాడగలరు.

Body:నోట్ : ఒంగోలు నుండి వచ్చే ఫైల్ లో స్క్రిప్ట్ ను వాడగలరు.

Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.