ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు.. పాల్గొన్న ప్రముఖులు - home minister mekathoti sucharitha news

రాష్ట్రవ్యాప్తంగా శైవాలయాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. విశాఖలోని కొత్తపేటలో పదిహేను అడుగుల మహా లింగేశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. పలు ఆలయాల్లో జరిగిన వేడుకల్లో ప్రముఖులు పాల్గొన్నారు.

Mahashivaratri celebrations
మహాశివరాత్రి ఉత్సవాలు
author img

By

Published : Mar 12, 2021, 1:26 PM IST

విశాఖ జిల్లాలో..

రావికమతం మండలం కొత్తకోటలో రాజన్న ఫౌండేషన్ చైర్మన్ పీవీఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 15 అడుగుల మహా శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు.

గొలుగొండ మండలం ధారమట్టంలోని శ్రీ శ్రీధర మల్లేశ్వరి అమ్మవారి ఆలయాన్ని నర్సీపట్నం ఏఎస్పీ తుహన్ సిన్హా సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడిలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ కమిటీ నిర్వాహకులకు చెప్పారు.

విజయనగరం జిల్లాలో..

పార్వతీపురంలో అర్ధరాత్రి లింగోద్భవ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పంచామృత అభిషేకాలు, అష్టోత్తర పూజలు చేశారు. శివలింగాలను అలంకరించి.. బియ్యంతో అభిషేకించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని.. స్వామివారిని దర్శించుకున్నారు. బైపాస్ రోడ్​లోని ఉమా రామలింగేశ్వర శివారులోని పశుపతినాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి.

తూర్పు గోదావరి జిల్లాలో..

వైరామవరం మండలం పూతిగుంట గ్రామంలోని శివాలయంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇక్కడ మూడు రోజుల పాటు ప్రత్యేక జాతర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

శివరాత్రి వేడుకల్లో ప్రముఖులు:

రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత గుంటూరు జిల్లాలోని కోటప్పకొండను సందర్శించారు. ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. ప్రజలు సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

కృష్ణా జిల్లా ముసునూరు మండలం బలివే గ్రామంలో ఉన్న శ్రీ బలే రామస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, నూజివీడు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ప్రకాశం జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన త్రిపురాంతక క్షేత్రంలోని మహా శివరాత్రి వేడుకల్లో విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేశ్​ పాల్గొన్నారు. పండుగ సందర్భంగా ఆలయంలో చేసిన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి: కమనీయం ముక్కంటి కల్యాణం.. కన్నుల పండువగా ఊరేగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.