Lovers commit suicide in Bapatla district: బాపట్ల జిల్లాలో ప్రేమికులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. బాపట్ల పట్టణానికి చెందిన ఓ విద్యార్థి, కర్లపాలెం మండలం చింతాయపాలేనికి చెందిన రత్నబాబు(21).. కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించలేదని మనస్తాపం చెందిన ఆ ఇద్దరు.. సోమవారం రాత్రి ఉప్పరపాలెం రైల్వే గేటు సమీపంలో రైలు కిందపడి బలవన్మరణం చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. ఈ విషయం ఇంకా తమ దృష్టికి రాలేదని రైల్వే పోలీసులు చెపుతున్నారు.
Vishaka Crime news: విశాఖలో ఓ జంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో బాలిక మృతిచెందగా.. యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక(17), కంచరపాలెం ఏఎస్ఆర్ నగర్‌కు చెందిన కృష్ణ(19).. ఇరువురి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. అయితే.. సోమవారం వీరిద్దరూ కలిసి విషం తీసుకున్నారు. ఘటనలో బాలిక మృతిచెందగా.. యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలిక కనిపించడంలేదని ఆమె తల్లిదండ్రులు సోమవారం ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇవాళ కూతురి మరణ వార్త తెలుసుకున్న ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుడు, బాలికకు ఉన్న సంబంధం ఏమిటి?. వీరు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: