ETV Bharat / city

కృష్ణా బోర్డు కార్యాలయం ఏర్పాటుపై రగడ.. విశాఖ వద్దంటున్న సాగునీటి సంఘాల సమాఖ్య

కృష్ణాబోర్డు ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యదర్శికి తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ మేరకు బోర్డుకు లేఖ రాశారు. సాగునీటి సంఘాల సమాఖ్య మాత్రం దీనికి అంగీకరించబోమంటుంది.

krishna board
krishna board
author img

By

Published : Jan 4, 2021, 6:46 AM IST

కృష్ణాబోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యదర్శికి తెలిపారు. తాజాగా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ మేరకు బోర్డుకు లేఖ రాశారు. డిసెంబరు 25న ఆయన రాసిన లేఖ ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఇంతకుముందు ఈ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటుచేయాలన్నది ప్రభుత్వ విధానంగా ఉండేది. ఇప్పుడు తమ వైఖరి మార్చుకుని విశాఖలో ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. అక్టోబరు 6న దిల్లీలో సర్వోన్నత మండలి (అపెక్సు కౌన్సిల్‌) సమావేశం కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన జరిగింది.

ఆ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్సు విధానంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో కృష్ణాబోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో, గోదావరి బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అపెక్సు కౌన్సిల్‌ నిర్ణయం మేరకు కృష్ణా బోర్డు కార్యదర్శి ఏపీ జలవనరుల శాఖకు నవంబరులో లేఖ రాశారు. ఇందుకు స్పందనగా ఏపీ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డిసెంబరు 25న తాజాగా లేఖ రాస్తూ విశాఖలోనే కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

విజయవాడలో ఏర్పాటుకు గతంలోనే నిర్ణయం

కృష్ణా బోర్డు కార్యాలయాన్ని వెలగపూడి సమీపంలో ఏర్పాటుచేయాలని నాటి ప్రభుత్వంలో కార్యదర్శిగా ఉన్న శశిభూషణ్‌ కుమార్‌ కృష్ణా బోర్డుకు, కేంద్ర జలవనరుల శాఖకు లేఖ రాశారు. అప్పటి ప్రభుత్వం విజయవాడలోనే కృష్ణాబోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగైతే మహారాష్ట్ర, కర్ణాటకలకు ఇబ్బంది అని తెలంగాణ ప్రస్తావిస్తూ.. హైదరాబాద్‌లో ఉంటేనే మంచిదంటూనే ఈ విషయంలో కేంద్ర జలవనరులశాఖ నిర్ణయంపై తమకు అభ్యంతరం లేదంది. దాంతో ఈ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటుచేయాలని కేంద్ర జలవనరులశాఖ 2018 జనవరిలో నిర్ణయించి, కృష్ణాబోర్డు ఛైర్మన్‌కు లేఖ రాసింది. ఈ మేరకు ఏపీ జలవనరులశాఖ అధికారులు విజయవాడలో భవనం చూశారు. కృష్ణా బోర్డు అధికారులు కూడా వచ్చి చూశారు. ఈలోపు ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటుచేయాలని 2019 నవంబరులో కేంద్ర జలశక్తి కార్యదర్శికి సైతం లేఖ రాశారు. ఆ తర్వాత 2020 జూన్‌లో సీఎస్‌ నీలం సాహ్ని సైతం ఈ కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి కార్యదర్శికి లేఖ రాశారు. ఇప్పుడు హఠాత్తుగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది.

మేం అంగీకరించం

కృష్ణాబోర్డు ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నం తరలించేందుకు ప్రయత్నిస్తే తాము అంగీకరించబోమని రాష్ట్ర సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల గోపాలకృష్ణ హెచ్చరించారు. కృష్ణా పరీవాహకంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 38 లక్షల మంది ఆయకట్టుదారులతో ఆందోళనకు దిగుతామని ప్రకటించారు. కృష్ణానదిని ఆనుకుని ఉన్న విజయవాడలో కాకుండా, ఎక్కడో 400 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం నేపథ్యంలో తాము కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి ఈ-మెయిల్‌లో వినతి పంపామని, విజయవాడలోనే కార్యాలయం ఉండేలా చూడాలని విన్నవించామని తెలిపారు. ఈ కార్యాలయాన్ని విశాఖపట్నం తరలించాలని ప్రభుత్వం నిర్ణయించడం సరైన చర్య కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటుచేయాలని ఆయన కోరారు.

ఇదీ చదవండి: చంద్రబాబుపై పోలీసులకు ఎంపీ విజయసాయి ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.