చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంతా కలిసి చేసుకునే పండుగ సంక్రాంతి. అమ్మాయిలు ముగ్గుల పోటీలతో సందడి చేస్తే, యువకులు కోడి పందేలతో సంబరాలు చేసుకుంటారు. అయితే చిన్నారులు సహా కుటుంబం మెుత్తం గాలి పటాలు ఎగరేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ఈ పండగ వేళ పతంగులకు మంచి గిరాకీ ఉంటుంది. అందుకు అనుగుణంగా విశాఖ దుకాణదారులు వైవిధ్యమైన పతంగులను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు.
చిన్నారులు సహజంగా కార్టూన్ బొమ్మలతో రూపొందించిన గాలి పటాలు తీసుకునేందుకు మక్కువ చూపిస్తుంటారు. అయితే ఈసారి రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో రాజమౌళి తీసిన ట్రిపులార్ సినిమా పతంగులు కొనుగోళ్లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దుకాణ యజమానులు సైతం దేశంలోని ప్రముఖ నగరాల నుంచి విభిన్నమైన గాలిపటాల్ని తెప్పించి మరీ విక్రయిస్తున్నారు. కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గాలిపటాల్ని ఆకాశంలో ఎగరేసేందుకు చిన్నారులతో పాటు పెద్దలు సైతం ఎదురుచూస్తున్నారు.
ఇదీచదవండి: సినీ పరిశ్రమ సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని భావిస్తున్నాం: చిరంజీవి