![indian navy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/download_1110newsroom_1570805683_511.jpg)
రెండో విడత.. భారత్, బంగ్లాదేశ్ సంయుక్త నావికా విన్యాసం.. కోర్పాట్ ను ఉత్తర బంగాళాఖాతంలో నిర్వహించారు. నిన్న ప్రారంభమైన నౌకా విన్యాసాలు ఇవాళ ముగిశాయి. రెండు దేశాల మధ్య మైత్రికి సూచికగా కిందటేడాది నుంచి వీటిని నిర్వహిస్తున్నారు. రెండోదఫా నిర్వహించిన సంయుక్త విన్యాసాల్లో.. భారత్ నుంచి గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయిర్ ఐఎన్.ఎస్ రణ్ విజయ్, దేశీయంగా నిర్మించిన మిస్సైల్ కార్వెట్.. ఐఎన్ఎస్ కుతూర్ పాల్గొన్నాయి. బంగ్లాదేశ్ నుంచి ఫ్రిగేట్ యుద్ధ నౌైక అలీ హైదర్, మిస్సైల్ కార్వెట్- షాది నోటా.. పాల్గొన్నాయి.