ETV Bharat / city

సీపీఎస్ రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాల నిరసన - ఏపీలో ఉద్యోగుల తాజా వార్తలు

సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. రాష్టవ్యాప్తంగా ఉద్యోగ సంఘాల నిరసనలు మారుమోగాయి. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీపీఎస్ విధానం వల్ల 2004వ సంవత్సరం తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారికి పెన్షన్ సౌకర్యం ఉండదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. పెండింగ్​లో ఉన్న పీఆర్సీ అమలు చేయాలని కోరారు.

Job unions
Job unions
author img

By

Published : Sep 1, 2020, 4:09 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో..
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పి.గన్నవరం ఎంపీపీ కార్యాలయం వద్ద యూటీఎఫ్ నాయకులు ఒకరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఉపాధ్యాయ ఉద్యోగులకు నష్టం కలిగించే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రత్తిపాడు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉపాధ్యయ సంఘాలు నిరసన చేపట్టాయి. ముఖ్యమంత్రి జగన్ గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలో..
ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉద్యోగ, కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సంఘం సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

కృష్ణాజిల్లాలో..
విజయవాడలో ఉపాధ్యాయ ఐక్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని స్వయంగా సీఎం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఉద్యోగులకు మేలు చేయడం అంటే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయడమే అన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో..
జిల్లావ్యాప్తంగా ఉద్యోగులు ధర్నాలు నిర్వహించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఎన్జీవో హోం వద్ద ధర్నా చేపట్టారు. అలాగే న్యూకాలనీ డైమండ్‌ పార్క్‌ వద్ద ఆల్‌ పెన్షనర్స్‌ మరియు రిటైర్డ్‌ పెన్షనర్స్‌ అసోషియేషన్‌ ఆందోళన చేశారు. భద్రత లేని ఉద్యోగులకు ఏ మాత్రం ఆమోదం కానీ కాంట్రీబ్యుటరీ పెన్షన్‌ విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

నరసన్నపేటలో ఏపీ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల అసోసియేషన్ - నరసన్నపేట శాఖ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మార్వోకు వినతి పత్రం అందించారు.

విశాఖ జిల్లాలో..
సెప్టెంబరు 1 చీకటి రోజుగా పేర్కొంటూ ఉద్యోగులకు ఇస్తున్న నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కు ఉపాధ్యాయ సంఘాలు వినతిపత్రాన్ని అందజేశారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కడప జిల్లాలో..
జమ్మలమడుగు మండల శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల విద్యాశాఖాధికారికి, ఎమ్మార్వోకు వినతిపత్రం అందచేశారు.

ప్రకాశం జిల్లాలో..
ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు నిరసన చేపట్టారు. భోజన విరామ సమయంలో ఏపీఎన్జీవోలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి.. నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్​ను రద్దు చేస్తామని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినందున ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరారు.

అనంతపురం జిల్లాలో..
ధర్మవరం ఆర్డీవో కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం వద్ద శిబిరం ఏర్పాటు చేసి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.

ఇదీ చదవండి: సుధాకర్ కేసులో కుట్ర కోణం... విచారణకు మరింత సమయం : సీబీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.