విశాఖ రైల్వే స్టేషన్లో అక్రమంగా దిల్లీకు గంజాయి తరలిస్తున్న ముఠాను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. కరోనా సమయాన్ని అదునుగా భావించి విశాఖ నుంచి బయలుదేరే ఏపీ ఎక్స్ ప్రెస్‌లో ఆగ్రా, దిల్లీకి గంజాయిని రవాణా చేసేందుకు నలుగురు సభ్యుల ముఠా ప్రయత్నించారు. రైల్వే స్టేషన్లో బ్యాగుల తనిఖీ కేంద్రం వద్ద వీరిని జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.... విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని కొలుగోలు చేసినట్లు తెలిపారు.
ఒడిశా, యూపీ, బీహార్‌కు చెందిన వీరు ఏపీ ఎక్స్ ప్రెస్‌లో దర్జాగా రిజర్వేషన్లు చేయించుకుని... మరీ రవాణాకు పాల్పడేందుకు సిద్ధపడినట్లు ఆర్పీఎఫ్ సెక్యూరిటీ కమిషనర్ జితేంద్ర శ్రీ వాస్తవ్ తెలిపారు. వీరి వద్ద నుంచి 38 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: మంత్రి స్వగ్రామంలో మద్యం, పేకాట శిబిరాలు...అడ్డుకున్న పోలీసులపై దాడి