ఎల్‌జీ పాలిమర్స్ ఘటనపై నివేదిక ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీకి.. గడువు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ నెల 22 నాటికి నివేదికను ప్రభుత్వానికి అందించాలని కమిటీని ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 7తో కమిటీ గడువు ముగుస్తుంది. నివేదిక ఇచ్చేందుకు సమయం కావాలని నీరబ్‌కుమార్ ప్రసాద్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది.
కమిటీ విజ్ఞప్తి మేరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రమాద ఘటనపై మరిన్ని కోణాల్లో విచారణ చేపట్టాలని ప్రభుత్వం కమిటీకి సూచించింది. వివిధ కేంద్ర సంస్థల నిపుణులకు హైపవర్ కమిటీలో చోటు కల్పించిన ప్రభుత్వం.. సీపెట్, సీపీసీబీ, డీజీఎఫ్ఏఎస్ఎల్ఐ, ఐఐపీ నిపుణులను కమిటీలో నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: