ETV Bharat / city

కాపులుప్పాడలో అతిథిగృహం నిర్మాణంపై హైకోర్టు కీలక ఆదేశాలు - visakha latest news

కాపులుప్పాడ కొండపై అతిథిగృహం నిర్మాణాన్ని సవాల్ చేస్తూ... అమరావతి ఐకాస నేత గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిగింది. గెస్ట్​హౌస్​కు కేటాయించిన 30 ఎకరాల్లో చెట్లు నరకవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

High Court order on construction of guest house in Kapuluppada
కాపులుప్పాడలో అతిధిగృహం నిర్మాణంపై హైకోర్టు కీలక ఆదేశాలు
author img

By

Published : Nov 27, 2020, 3:07 PM IST

విశాఖ కాపులుప్పాడ కొండపై అతిథిగృహ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ... అమరావతి ఐకాస నేత గద్దె తిరుపతిరావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ జరిగింది. గ్రేహౌండ్స్​కు ఇచ్చిన స్థలంలో అతిథిగృహం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదించారు. గ్రేహౌండ్స్ నక్సల్స్, టెర్రరిస్ట్ వ్యతిరేక దళం, రహస్య ఆపరేషన్ నిర్వహిస్తుంటుందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. గెస్ట్​హౌస్​కు కేటాయించిన 30 ఎకరాల్లో చెట్లు నరకవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అతిథిగృహం నిర్మాణం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదీ చదవండీ...

జనవరి నాటికి పంట నష్ట పరిహారం చెల్లించాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.