ETV Bharat / city

HEAVY RAIN: విశాఖలో వర్షం.. రోడ్లన్నీ జలమయం.. వాహనదారులకు ఇబ్బందులు - rains news

అల్పపీడనం వల్ల విశాఖ నగరంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో నీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులు ముప్పతిప్పలు పడుతున్నారు.

HEAVY RAIN
HEAVY RAIN
author img

By

Published : Oct 16, 2021, 3:12 PM IST

విశాఖలో ఏకధాటిగా కురుస్తున్న వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చావుల మదం జంక్షన్ లో భారీగా వరద నీరు చేరుకుంది. రైల్వే స్టేషన్, జ్ఞానాపురం గేటు వైపునకు రాకపోకలకు తీవ్ర అంతరాయం(heavy rain at vizag city lead difficulties to motor vehiclers) కలిగింది. చిన్నపాటి వర్షానికి కూడా నీరు భారీగా నిలిచిపోవడం వల్ల ఈ మార్గం మీదుగా వెళ్లే వారికి తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తోంది.

గతంలో ఈ సమస్య నివారణకు చేపట్టిన చర్యలు ఏ మాత్రం ఫలితాన్ని ఇవ్వకలేకపోతున్నాయని స్థానికులు అంటున్నారు. వర్షం వస్తే ఈ కూడలిలోని నీరు తగ్గాలంటే కనీసం రెండు నుంచి మూడు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయే పరిస్ధితి నెలకొందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

విశాఖలో మావోయిస్టు సభ్యురాలు కొర్రా కుమారి లొంగుబాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.