విశాఖ నగర వైకాపా కార్యాలయంలో ఆదివారం ముఖ్య కార్యకర్తలతో వైకాపా నేత విజయసాయిరెడ్డి సమావేశం నిర్వహించారు. అక్టోబరు 17 నాటికి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని... రెండు మూడు రోజులు అటూ ఇటగా వచ్చినా కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికలొస్తే ముందుగా పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని, తరువాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయని వివరించారు. డిసెంబరు చివరికల్లా ఎన్నికలు ప్రక్రియంతా ముగుస్తుందని చెప్పారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులు నిలిచిపోవడానికి పెద్ద కారణాలున్నాయన్న విజయసాయి... భారీ అవినీతి జరిగినందునే వాటిని నిలిపివేశారన్నారు. కార్యకర్తల సమావేశంలో మంత్రులు అవంతి శ్రీనివాస్, మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: