Foreign Experts Group Visiting Polavaram in Third Day : పోలవరం ప్రాజెక్టు వద్ద విదేశీ నిపుణుల బృందం పర్యటన మూడో రోజుకు చేరుకుంది. డయాఫ్రమ్ వాల్ నూతనంగా నిర్మించేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలించిన అనంతరం పాత డయాఫ్రం వాల్ కు ఎగువన ఆరు మీటర్ల దూరంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని నిపుణుల కమిటీ నిర్ణయించింది. అదే విధంగా ఆఫ్రి సంస్థ రూపొందించిన డిజైన్లపై నిపుణుల బృందం సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేసే విషయంలో ఉన్న అవకాశాలపై నిపుణుల కమిటీ పలు సూచనలు చేసింది.
ప్రాజెక్టులో ప్రధాన డ్యామ్ నిర్మాణం, డిజైన్లు, నిర్మాణ షెడ్యూల్‌పై అధికారులు, కేంద్ర జలసంఘం ఛైర్మన్‌తో విదేశీ నిపుణుల బృందం చర్చించారు. దిల్లీ నుంచి వర్చువల్ విధానంలో కేంద్ర జలసంఘం ఛైర్మన్ పాల్గొన్నారు. రేపు కీలకమైన నాణ్యత నియంత్రణ అంశాలపై విదేశీ బృందం చర్చించనుందని అధికారులు తెలిపారు.
2028 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి - అధికారులకు చంద్రబాబు ఆదేశం
మరోసారి పోలవరం ప్రధాన డ్యాం అంచనాలు పెంపు - ఎన్ని వేల కోట్లంటే ?