ETV Bharat / politics

పరారీలో సోషల్ మీడియా సైకో వర్రా రవీందర్‌రెడ్డి - ముమ్మరంగా పోలీసుల గాలింపు

వైఎస్సార్​సీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి కోసం పోలీసుల గాలింపు - హైదరాబాద్‌, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లిన ప్రత్యేక బృందాలు

Police_Searching_for_Varra_Ravinder
Police_Searching_for_Varra_Ravinder (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2024, 4:03 PM IST

Police Searching for YSRCP Leader Varra Ravinder Reddy: పులివెందులకు చెందిన వైఎస్సార్​సీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త, సోషల్‌ మీడియా సైకోగా పేరొందిన వర్రా రవీందర్‌రెడ్డి కోసం వైఎస్సార్‌ జిల్లా పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతోంది. 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వర్ర రవీందర్​ రెడ్డి ఆచూకీ కోసం యత్నిస్తున్నాయి. కమలాపురం, పులివెందులతో పాటు హైదరాబాద్‌, బెంగళూరు తదితర ప్రాంతాలకు పోలీసు బృందాలు వెళ్లాయి. వర్రా రవీందర్‌రెడ్డి వాడే 2 ఫోన్లూ స్విచ్చాఫ్‌లో ఉన్నాయని అతనిపై అన్ని రకాలుగా నిఘా పెట్టామని పోలీసులు తెలిపారు. రెండు రోజుల కిందట పోలీసుల నిర్లక్ష్యంతో పరారైన రవీందర్ రెడ్డిని పట్టుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు రావడంతో అతనికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

వర్రా రవీందర్‌రెడ్డి సోషల్‌ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, జగన్‌ తల్లి విజయమ్మ, మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతపై సోషల్‌ మీడియాలో అత్యంత హేయంగా, జుగుప్సాకరంగా పోస్టులు పెట్టారు. గత ఐదేళ్లుగా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న రవీందర్ రెడ్డిని వైఎస్సార్​సీపీ ప్రభుత్వం వెనుకేసుకొచ్చింది. దీంతో ఆయనపై మంగళగిరి, హైదరాబాద్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు వర్రా రవీందర్​ రెడ్డిని అదుపులోకి తీసుకుని కడప పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు వదిలేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై సీఎం చంద్రబాబు, డీజీపీ ద్వారకా తిరుమలరావు తీవ్రంగా స్పందించారు.

కర్నూలు రేంజ్‌ డీఐజీ ప్రవీణ్‌ను కడపకు పంపి ఆయన ఇచ్చిన నివేదిక మేరకు జిల్లా ఎస్పీని బదిలీ చేయడంతో పాటు మరికొన్ని చర్యలకు ఉపక్రమించింది. సీఐ తేజ మూర్తి పైన సస్పెన్షన్ వేట పడింది. పులివెందులకు చెందిన వైఎస్సార్​సీపీ కీలక నేతతో పోలీసులు చేసుకున్న లోపాయికారి ఒప్పందంతో 41-ఏ నోటీసులిచ్చి వదిలేసినట్లు ఆరోపణలున్నాయి. నోటీసులిచ్చి వదిలేసే సమయంలో మరో కేసులో అరెస్టు చేసేందుకు రాజంపేట పోలీసులు కడపకు రాగా, అక్కడి పోలీసులు వారికి అప్పగించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో రవీందర్‌రెడ్డి పారిపోయాడు. దీంతో అతని కోసం గాలింపు కొనసాగుతోంది. కొత్తగా వచ్చిన ఎస్పీ విద్యాసాగర్ 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి రవీందర్ రెడ్డిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రెండు రోజుల్లో అతని పట్టుకుంటామని పోలీసు వర్గాలు తెలియ జేస్తున్నాయి.

'వారం రోజుల్లో ఖాళీ చేయాలి' - కేతిరెడ్డి గుర్రాల కోటకు నోటీసులు

పోలీస్ కోవర్టుల కనుసన్నల్లోనే 'వర్రా' పరార్! - తెరవెనుక దాగి ఉన్న షాకింగ్ నిజాలు ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.