రింగు వలలతో చేపల వేటను పూర్తి స్థాయిలో నిషేధించి.. సాంప్రదాయ చేపల వేట కొనసాగించేలా ఆదేశించాలని ప్రభుత్వాన్ని రింగు వలల వ్యతిరేక ఐక్యవేదిక నాయకులు తెడ్డు పరసన్న డిమాండ్ చేశారు. విశాఖ సముద్ర తీర ప్రాంతంలో సాంప్రదాయ మత్స్యకారుల జీవనానికి విఘాతం కలిగిస్తున్న రింగు వలలతో చేపలు పట్టడాన్ని నిషేధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని పరసన్న తెలిపారు. విశాఖలోని వీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రింగు వల నిషేధంపై అధికారులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. మా విజ్ఞప్తిని సానుకూలంగా స్పందించిన హైకోర్టు.. తమకు అనుకూలంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆయన కోరారు. విశాఖ జిల్లాలో సుమారుగా ఆరు వేల పైన సాంప్రదాయ బోట్లు కలిగి సంప్రదాయ పద్ధతిలో సముద్రంలో చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్నారని అన్నారు. జాలర్లకు రక్షణకు సరైన భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని పరసన్న డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మత్స్యకార ఐక్య వేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: