విశాఖ మన్యంలో యథేచ్ఛగా నకిలీ నోట్ల చలామణి - విశాఖ మన్యంలో యథేచ్ఛగా నకిలీ నోట్ల చలామణి వార్తలు
విశాఖ మన్యంలో దొంగ నోట్లు చెలామణి చేసే కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. వారాంతపు సంతలు, అమాయకపు ప్రజలే లక్ష్యంగా నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్నారు.
విశాఖ మన్యంలో దొంగ నోట్లు చెలామణి చేసే కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. వారాంతపు సంతలు, అమాయకపు ప్రజలే లక్ష్యంగా నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్నారు. మన్యంలోని 11 మండలాల్లో దొంగ నోట్ల ముఠాలు ప్రజలను మోసం చేస్తున్నాయి. నకిలీ నోట్లను గుర్తించలేక అమాయకులు నష్టపోతున్నారు.
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మదీనా అనే మహిళ మూరుమూల సంతలో బొమ్మలు అమ్ముకొని జీవనం సాగిస్తోంది. ఇవాళ ఉదయం తనకు ఓ వ్యక్తి రూ. 2 వేల నోటు ఇచ్చి రూ. 600 విలువ చేసే బొమ్మలు కొనుగోలు చేశాడని.. తన దగ్గర ఉన్న మెుత్తం రూ.1400 చిల్లర మెుత్తాన్ని వారికి ఇచ్చేశానని మహిళ తెలిపింది. తీరా అది నకిలీ నోటుగా గుర్తించి నష్టపోయానని ఈటీవీ-భారత్ దృష్టికి తీసుకువచ్చింది.
ఏవోబీలో గంజాయి లావాదేవీల్లోనూ..దొంగ నోట్లు చలామణి ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసింది. దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని బాధిత ప్రజలు కోరుతున్నారు.