విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గేదే లేదన్న కేంద్రం.. దిల్లీకి పయనమైన కార్మికులు - విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గని కేంద్రం
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదంటూ.. కేంద్రం మళ్లీ ప్రకటించడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రులు సహా ఇతర పార్టీల నేతలకు సమస్య వివరిస్తామంటూ దిల్లీకి పయనమయ్యారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి ఎంతవరకైనా పోరాడుతామని తేల్చి చెప్పారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులకు మేలు చేయాలని కేంద్రం చూస్తోందన్న ఎమ్మెల్సీ మాధవ్.. పరిశ్రమ నిర్వాసితులను దిల్లీ తీసుకెళ్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉక్కు పరిశ్రమల అంశంలో చూసిచూడనట్లు ఉన్న కేంద్రం.. విశాఖ ఉక్కుపై ఎందుకు పట్టువీడటం లేదని ప్రశ్నిస్తున్న కార్మిక సంఘం నేతలతో ముఖాముఖి...