కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఎల్ఐసీ వాటాల విక్రయం దిశగా నిర్ణయాన్ని ప్రకటించడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విశాఖలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విశ్వాసాన్ని కలిగి ఉన్న లాభదాయక సంస్థను ప్రైవేటుపరం చేసే దిశగా తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ నెల 4న అఖిల భారత బీమా ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు భోజన విరామం సమయంలో ఒక గంట వాక్ ఔట్ స్ట్రైక్ చేస్తున్నట్లు వెల్లడించారు.
'ఎల్ఐసీ వాటాలు విక్రయించాల్సిన అవసరమేముంది?' - నిర్మలా సీతారామన్ వార్తలు
జీవిత బీమా కార్పొరేషన్(ఎల్ఐసీ) వాటాలను విక్రయిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దీనిపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. లాభాల్లో ఉన్న సంస్థ షేర్లు విక్రయించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాయి. ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించాయి.

ఇదీ చదవండి: