TDP leaders: ఆంధ్రప్రదేశ్ మళ్లీ మోసపోదు.. వైకాపా బారి నుంచి ఉత్తరాంధ్రను కాపాడుకుందాం అనే నినాదంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై.. విశాఖ తెలుగుదేశం కార్యాలయంలో చర్చాగోష్ఠి నిర్వహించనున్నారు. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 34 అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర నాయకులు తదితరులు ఈ గోష్ఠిలో పాల్గొననున్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా.. ఈ కార్యక్రమం జరగుతుందని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.
తెదేపా పాలనలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమం , నీటి పారుదల ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు ప్రకటించారు. పారిశ్రామిక, ఐటీ అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, విద్య, వైద్యం, తదితర రంగాల్లో సాధించిన పురోగతిపై విస్తృత చర్చ సాగుతుందని వెల్లడించారు. మహాగర్జన ముసుగులో వైకాపా దుష్టశక్తులు తెదేపా కార్యాలయంపై దాడి చేస్తారనే అనుమానం ఉందని పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. చర్చాగోష్ఠిని భగ్నం చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసిందని, శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు తీసుకోవాలని పోలీసులకు వినతిపత్రం సమర్పించామని తెలిపారు.
ఇవీ చదవండి: