ETV Bharat / city

గీతం వర్సిటీకి చెందిన కొన్ని కట్టడాలు కూల్చివేత

విశాఖ గీతం యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని కట్టడాలను....రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. గీతం విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం, ప్రహరీగోడతోపాటు...సెక్యూరిటీ రూములను పడగొట్టారు. పోలీసుల బందోబస్తు మధ్య....జేసీబీ, బుల్‌డోజర్లతో ప్రక్రియ పూర్తిచేశారు. ఆక్రమణలో ఉన్న భూమిలో ఉన్న కట్టడాలనే కూల్చేశామని రెవెన్యూ అధికారులు చెబుతుండగా....ముందస్తు సమాచారం లేదని యాజమాన్యం అంటోంది.

demolition-of-structures-belonging-to-visakha-geetham-university
గీతం వర్సిటీకి చెందిన కొన్ని కట్టడాలు కూల్చివేత
author img

By

Published : Oct 24, 2020, 9:36 AM IST

Updated : Oct 24, 2020, 11:48 AM IST

ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ...విశాఖ గీతం వర్శిటీలో కట్టడాలను అధికారులు కూల్చేశారు. వేకువజామునుంచే ప్రక్రియను ప్రారంభించారు. రుషికొండ మార్గంలో ఉన్న భారీ గేటును తొలుత కూల్చేసిన అధికారులు...అనంతరం ప్రహరీ గోడలన్నీ కూల్చేశారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రహరీ కూల్చివేత పూర్తయ్యాక... వైద్యకళాశాల నార్త్‌గేట్‌లో ఉన్న ప్రహరీగోడను పడగొట్టారు. ముందుగానే భారీగా చేరుకున్న పోలీసులు... బారికేడ్లు ఏర్పాటు చేసి లోపలికి ఎవరినీ రానివ్వలేదు. రెవెన్యూ అధికారులు దగ్గరుండి ప్రక్రియను పర్యవేక్షించారు.

గీతం వర్సిటీకి చెందిన కొన్ని కట్టడాలు కూల్చివేత

సమాచారం తెలుసుకుని వర్శిటీకి చేరుకున్న యాజమాన్యం ప్రతినిధులు...... అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నోటీసులు ఇవ్వకుండానే వర్సిటీ కట్టడాలను కూల్చివేశారని ఆరోపించారు. ఎందుకు కూల్చేశారో తెలియడం లేదని చెప్పారు. అధికారులు కనీస పద్ధతి పాటించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.

వర్సిటీ సిబ్బంది స్పందన

గీతం వర్సిటీకి చెందిన 40 ఎకరాల భూమి ఆక్రమణలో ఉందని...ఆర్డీవో పెంచల కిషోర్ చెబుతున్నారు. ఆక్రమణకు సంబంధించి వర్సిటీ యాజమాన్యం సంప్రదింపులు జరిపిందని....ప్రభుత్వ విధానం మేరకు ఆక్రమణలు తొలగిస్తున్నట్లు కిషోర్ తెలిపారు. ప్రస్తుతం ప్రహరీ గోడ, ప్రధాన ద్వారం కూల్చివేశామన్న ఆయన....ఆక్రమణలో ఉన్న భూమిలో... కొన్ని భారీ కట్టడాలు కూడా గుర్తించినట్లు చెప్పారు. తదుపరి దశలో వాటిని కూడా కూల్చివేసే ప్రక్రియ ఉంటుందన్నారు.

ఆర్డీవో పెంచల కిషోర్ స్పందన

ఇదీ చదవండి:

విశాఖ గీతం వర్సిటీకి చెందిన నిర్మాణాలు కూల్చివేస్తున్న రెవెన్యూ సిబ్బంది

Last Updated : Oct 24, 2020, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.