death Roads విశాఖపట్నంలో రోడ్డుపైనున్న ఓ గుంత... రవ్వా సుబ్బారావు అనే వ్యక్తిని బలి తీసుకుంది. ఈ నెల 4న డీఆర్‌ఎం కార్యాలయం నుంచి రైల్వేస్టేషన్‌కు బైక్‌పై వెళ్తూ... రహదారి మధ్యలోని గుంత కారణంగా ఆయన కిందపడిపోయారు. తలకు తీవ్ర గాయమై 2 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన సుబ్బారావు... ఈ నెల 6న మృతి చెందారు. ఈ ప్రమాదం మరిచిపోకముందే అదే గుంత వల్ల మరో యువకుడూ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న సుబ్బారావు అల్లుడు వెంకటరావు చలించిపోయారు. అయినవారు దూరమైన బాధలో ఉన్నా... మానవత్వంతో స్పందించారు. మరెవరికీ ఆపద రాకూడదని సొంత ఖర్చుతో సిమెంటు, ఇసుక, కంకర తెచ్చి స్వయంగా గుంతను పూడ్చారు. అధికారులు చేయాల్సిన పనిని ఇలా ప్రజలే చేసుకోవాల్సి రావడమేంటని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.
ఇవీ చదవండి: