ETV Bharat / city

Employees Rally: రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎస్​ ఉద్యోగ సంఘాల నిరసన - CPS job unions protest

పాత పింఛన్​ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్​ చేస్తూ.. సీపీఎస్​ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టారు. పలు ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. సభలు ఏర్పాటు చేశారు.

సీపీఎస్​ ఉద్యోగ సంఘాల నిరసన
author img

By

Published : Sep 1, 2021, 12:54 PM IST

Updated : Sep 1, 2021, 8:56 PM IST

సీపీఎస్​ విధానం రద్దు కోరుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. తక్షణమే పాత విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని.. కమిటీలతో కాలయాపన చేయకుండా పాదయాత్రలో ఇచ్చిన హామీని జగన్​ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరసనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

సీపీఎస్​ ఉద్యోగ సంఘాల నిరసన

విశాఖలో..

విశాఖ జీవీఎంసీ(GVMC) కార్యాలయం ఎదుట గాంధీ విగ్రహం వద్ద.. ఏపీ సీపీఎస్​(AP CPS) ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తక్షణమే పాత పింఛన్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. సీపీఎస్​ కోసం పోరాడుతూ.. ఇటీవల కరోనాతో కన్నుమూసిన వారికి నివాళులర్పించారు. తొలుత ర్యాలీ చేపట్టాలని భావించిన ఉద్యోగులు.. అందుకు పోలీసు అనుమతి లేకపోవడంతో.. కేవలం సభకే పరిమితమయ్యారు.

మచిలీపట్టణంలో..

మచిలీపట్నంలో ఉద్యోగసంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఆర్టీసీ డిపో నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు. ప్రస్తుత సీపీఎస్​ విధానంతో పదవీవిరమణ తర్వాత ఉద్యోగులు బాధపడతారని ఆవేదన వ్యక్తం చేశారు.

గుంటూరులో..

గుంటూరులో మూడు బొమ్మల కూడలి నుంచి కలెక్టరేట్‌ వరకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు ర్యాలీకి ఉపక్రమించారు. అయితే కలెక్టరేట్‌కు వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించగా.. జిల్లా కోర్టు మీదుగా ర్యాలీని మళ్లించారు. వర్షంలోనూ ఉద్యోగులంతా ర్యాలీ కొనసాగించారు.

కర్నూలులో..

సీపీఎస్​ విధానానికి వ్యతిరేకంగా కర్నూలులోనూ ఉద్యోగసంఘాలు నిరసనలు చేపట్టాయి. పెద్దఎత్తున తమ గళాన్ని వినిపించారు.

విజయవాడలో

సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ...ఉద్యోగ సంఘాలు విజయవాడలోని జిమ్ ఖానా మైదానంలో పింఛన్ విద్రోహ దినం పేరుతో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాదయాత్ర సమయంలో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా పట్టించుకోవటం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు తీర్చేందుకు ముందుకు రాకపోతే, పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ స్పష్టం చేశారు.

చిత్తూరు..

కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ..పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పిలుపు మేరకు చిత్తూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పచ్చల ప్రభాకర్ డిమాండ్ చేశారు.

కడప..

పాత పింఛన్ విధానాన్ని మళ్లీ అమల్లోకి తీసుకురావాలని కోరుతూ. వివిధ ఉద్యోగ సంఘాలు కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టాయి. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. చిన్నారులు సైతం.. తమ తల్లిదండ్రులకు పింఛన్ ఇవ్వాలంటూ ప్లకార్డులు పట్టుకున్నారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.

అనంతపురం..

అనంతపురం క్లాక్‌టవర్‌ వద్ద ఉద్యోగ సంఘాల ఆందోళనకు సీపీఐ CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మద్దతు తెలిపారు. ఉద్యోగులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తప్పుబట్టారు.

నెల్లూరు..

నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఎపీసీపీఎస్​ఈఎ, ఫ్యాప్టో ఆధ్వర్యంలో వేర్వేరుగా ధర్నాలు చేపట్టారు. రెండున్నరేళ్లుగా ఎదురుచూశాక.. ఆఖరికి ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ డిమాండ్లు పరిష్కరించాలన్నారు. ఒంగోలులో.. వివిధ ఉద్యోగసంఘాలు వేర్వేరు ర్యాలీలతో పాటు, కలెక్టేరట్ వద్ద ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ వద్దకు ఉద్యోగులంతా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రెండున్నరేళ్లుగా CPS రద్దు ఊసే లేదని మండిపడ్డారు. ఏలూరులో.. అగ్నిమాపక కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ఉద్యోగసంఘాలు ర్యాలీ నిర్వహించాయి. పోలీసులు వారిని అడ్డుకోగా.. ఉద్యోగులు అక్కడే బైఠాయించారు.

వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, 112వారాలైనా హామీని అమలు చేయలేదని ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు.

ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని ఉద్యోగులు చాలా సమయమే ఇచ్చారు. బయటకొచ్చి బాధ చెప్పుకోలేని విధంగా ఉద్యోగుల గొంతు నొక్కుతున్నారు. వైకాపా నేతలు ప్రభుత్వ ఉద్యోగుల్ని వేధించటంపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి. జగన్ రెడ్డి అధికారం చేపట్టాక ప్రభుత్వ ఉద్యోగుల్ని వైకాపా నేతలు వేధిస్తుండటంతో స్వేచ్ఛగా విధులు నిర్వర్తించలేకపోతున్నారు. నేతలు చెప్పిందల్లా చేయటానికి వారేమీ పార్టీ కార్యకర్తలు కాదు. ఉద్యోగులు పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తే వారు కాదని వైకాపా గుర్తించాలి. ధర్మవరంలో రాజకీయ ఒత్తిళ్లు తాళలేక అధికారులు సామూహిక సెలవులు పెట్టి వెళ్లిపోయారు. కదిరిలో వైకాపా కౌన్సిలర్లు వేధింపులు తాళలేక పట్టణ ప్రణాళిక అధికారి రహమాన్​ ఆత్మహత్య చేసుకుంటాననే స్థాయికి వచ్చారు. ఎస్సీ ఉద్యోగిని అనితారాణి వ్యవహారంపై ఇంతవరకూ చర్యలు లేవు. జీతాలు సైతం సక్రమంగా చెల్లించకుడా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్నారు. ఉద్యోగులను వేధించే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించకుంటే బాధితుల పక్షాన పోరాడతాం. -ఎమ్మెల్సీ అశోక్ బాబు

ఇదీ చదవండీ.. 'అడుగుకో గుంత.. గజానికో గొయ్యి.. ఇదీ వైకాపా పాలనలో రహదారుల దుస్థితి'

Last Updated : Sep 1, 2021, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.