సీఏఏ, ఎన్ఆర్సీపై కేంద్ర ప్రభుత్వం రోజుకో మాట మట్లాడుతోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా విశాఖలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాఘవులుతో పాటు ఇతర సీపీఎం ముఖ్యనేతలు హాజరయ్యారు. తమకు అనుకూలంగా లేని వారిని జాతీయ జనాభా పట్టిక ద్వారా అనుమానస్పద జాబితాలోకి చేర్చేందుకు భాజపా ప్రయత్నించే అవకాశం ఉందన్నారు. ఎన్ఆర్సీపై ఏపీ ప్రభుత్వం పార్లమెంట్లో మద్దతిచ్చినా... ఇప్పుడు తప్పు తెలుసుకుని రాష్ట్రంలో అమలుచేయడం లేదని ప్రకటించినట్లు తెలిపారు. ఎన్ఆర్సీ, సీఏఏపై తెదేపా, జనసేన తమ వైఖరిని ప్రజలకు తెలియజేయాలని రాఘవులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: