ETV Bharat / city

జగన్​ను అవంతి.. చంద్రబాబును గంటా ఒకే వేదికపైకి తీసుకురావాలి: నారాయణ - protests on vizag steel privatisation

మంత్రి అవంతి శ్రీనివాస్, తెదేపా సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావులకు.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఓ బాధ్యత అప్పజెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం.. జగన్ ను అవంతి, చంద్రబాబును గంటా.. ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా చూడాలని కోరారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
author img

By

Published : Feb 12, 2021, 11:58 AM IST

జగన్​ను అవంతి..చంద్రబాబును గంటా తీసుకురావాలి: నారాయణ

విశాఖలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల నేతలు చేపట్టిన దీక్షలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతుండగా... ఆయన పక్కనే మంత్రి అవంతి శ్రీనివాస్, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఉన్నారు.

వీరిద్దర్నీ ఉద్దేశిస్తూ... 'మంత్రి అవంతి శ్రీనివాస్ పై ఒక బాధ్యత ఉంది. ఎమ్మెల్యే గంటాపై ఒక బాధ్యత ఉంది. జగన్​ను అవంతి తీసుకువస్తే.. చంద్రబాబును గంటా తీసుకురావాలి. ఆ ఇద్దరూ ఒకే వేదికపైకి వస్తే స్టీల్ ప్లాంట్​ను తప్పక సాధిస్తాం' అంటూ నారాయణ వ్యాఖ్యలు చేశారు. వెంటనే స్పందించిన మంత్రి అవంతి.. జగన్, చంద్రబాబుకు నారాయణ స్నేహితుడని, ఆయన ఈ బాధ్యత తీసుకుంటే బాగుంటుందని సరదాగా వ్యాఖ్యానిస్తూ వెళ్లిపోయారు.

ఇదీ చదవండి:

ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పురపాలక ఎన్నికలకు ప్రభుత్వం అంగీకారం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.